బ్రేకింగ్: మాజీ మంత్రి అప్పలరాజుకు రిమాండ్
పలాస: రోడ్డు ప్రమాద కేసులో కుమారుడిని రక్షించేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను శ్రీకాకుళంలోని అంపోలు జైలుకు తరలించనున్నారు.
ఈ నెల 10న అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నించినట్లు పోలీసులు తేల్చి, ఆయన్ను ఏ3గా చేర్చారు. బుధవారం సాయంత్రం కాశీబుగ్గలోని ఆయన నివాసంలో అప్పలరాజును అరెస్ట్ చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచారు.