Summary

రోడ్డు ప్రమాద కేసులో కుమారుడిని రక్షించేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Article Body

సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ - పలాస కోర్టు
సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ - పలాస కోర్టు

బ్రేకింగ్: మాజీ మంత్రి అప్పలరాజుకు రిమాండ్

పలాస: రోడ్డు ప్రమాద కేసులో కుమారుడిని రక్షించేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన్ను శ్రీకాకుళంలోని అంపోలు జైలుకు తరలించనున్నారు.

ఈ నెల 10న అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మ బైక్‌ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నించినట్లు పోలీసులు తేల్చి, ఆయన్ను ఏ3గా చేర్చారు. బుధవారం సాయంత్రం కాశీబుగ్గలోని ఆయన నివాసంలో అప్పలరాజును అరెస్ట్‌ చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచారు.

 

Comments

TOPICS MENTIONED IN THIS ARTICLE

About the Author(s)

  • తెలుగు న్యూస్ అలర్ట్స్ టీమ్ photo

    తెలుగు న్యూస్ అలర్ట్స్ టీమ్

    రాజకీయ & వినోద వార్తల సంపాదక బృందం

    తెలుగు న్యూస్ అలర్ట్స్ సంపాదక బృందం రాజకీయాలు, వినోదం, టాలీవుడ్, సెలబ్రిటీ వార్తలు మరియు బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా, వేగంగా పాఠకులకు అందిస్తుంది.

    View all articles by తెలుగు న్యూస్ అలర్ట్స్ టీమ్

తెలుగు న్యూస్ అలర్ట్స్ | తాజా రాజకీయ & వినోద వార్తలు — తెలుగు న్యూస్ అలర్ట్స్‌లో తాజా రాజకీయ వార్తలు, సినీ వార్తలు, సెలబ్రిటీ అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక కథనాలు మరియు తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలను చదవండి.