అంగన్‌వాడీ సిబ్బందికి శుభవార్త: 'తల్లికి వందనం' పథకం అమలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందికి తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, మినీ టీచర్లు మరియు ఆయాలకు 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది అంగన్‌వాడీ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.