తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న విశేష ఉత్సవాల నేపథ్యంలో, జులై 14 మరియు 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
-
జులై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా వీఐపీ దర్శనాలు నిలిపివేయబడ్డాయి. వీటికి సంబంధించిన సిఫార్సు లేఖలను జులై 13న స్వీకరించరు.
-
జులై 17: ఆణివార ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ దర్శనాలకు సంబంధించిన లేఖలను జులై 16న స్వీకరించరు.
భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించవలసిందిగా టీటీడీ కోరింది.