తెలంగాణలో ఉచిత UPSC కోచింగ్ & స్టైపెండ్ - పూర్తి వివరాలు
తెలంగాణలోని బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 పరీక్షల కోసం తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (TGBCESDTC) ఉచిత దీర్ఘకాలిక కోచింగ్‌ను అందించనుంది.
ముఖ్య అంశాలు:
-
మొత్తం సీట్లు: 150 (100 సీట్లు స్క్రీనింగ్ పరీక్ష ద్వారా, 50 సీట్లు గతంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి).
-
ఆర్థిక సహాయం: హాజరు నిబంధనలకు లోబడి నెలకు రూ. 5,000 స్టైపెండ్ మరియు పుస్తకాల కోసం రూ. 5,000 వన్-టైమ్ గ్రాంట్.
-
కోచింగ్ కేంద్రం: టీజీ బీసీ స్టడీ సర్కిల్, సైదాబాద్, హైదరాబాద్.
అర్హతలు:
-
డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
-
కుటుంబ వార్షిక ఆదాయం: గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షల లోపు ఉండాలి.
-
ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగంలో లేదా ఇతర కోర్సుల్లో ఉండకూడదు.
ముఖ్యమైన తేదీలు:
-
దరఖాస్తు ప్రారంభం: జూలై 17, 2026.
-
చివరి తేదీ: ఆగస్టు 7, 2026.
-
స్క్రీనింగ్ పరీక్ష: ఆగస్టు 16, 2026.
-
తరగతులు ప్రారంభం: ఆగస్టు 24, 2026.
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 040-24071178 లేదా 7780359322 నంబర్లను సంప్రదించవచ్చు.