తెలంగాణలోని రైతులకు ఎరువుల కొనుగోలును మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం కొత్తగా ఫ్రేమ్‌వర్క్ ఫర్టిలైజర్ సేల్ (FFS) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు యూరియాతో పాటు డీఏపీ, పొటాష్, ఇతర కాంప్లెక్స్ ఎరువులను సులభంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
ఎరువులు బుక్ చేసుకునే విధానం:
-
Google Advertisement
డౌన్‌లోడ్ & రిజిస్ట్రేషన్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి FFS యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ మరియు దానికి అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
-
భూమి వివరాలు: యాప్ ఓపెన్ అయిన తర్వాత మీ పేరు, భూమి వివరాలు మరియు మీరు సాగు చేస్తున్న పంటను (ఉదాహరణకు: వరి) ఎంచుకోవాలి.
-
ఎరువుల ఎంపిక: మీకు కావలసిన ఎరువుల రకం (యూరియా, డీఏపీ మొదలైనవి) మరియు బస్తాల పరిమాణాన్ని (40 కిలోలు లేదా 45 కిలోలు) సెలెక్ట్ చేసుకోవాలి (ఎకరానికి గరిష్టంగా 2 యూరియా బస్తాలు మాత్రమే లభిస్తాయి).
-
షాప్ ఎంపిక & బుకింగ్: మీ జిల్లా పరిధిలోని ఫర్టిలైజర్ షాప్‌ను ఎంచుకుని, ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.