తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం!
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. ఈ భారీ నియామక ప్రక్రియకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను బోర్డు ఇప్పటికే ఖరారు చేసింది.
ముఖ్యమైన పోస్టుల వివరాలు:
-
సివిల్ కానిస్టేబుల్స్: 3,697
-
ఏఆర్ (AR) కానిస్టేబుల్స్: 1,052
-
సివిల్ ఎస్సై (SI): 148
-
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF): 1,380
-
వీటితో పాటు జైళ్ల శాఖ, ఫైర్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ విషయాన్ని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు ధృవీకరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడనుందని ఆయన తెలిపారు. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవాలని సూచించారు.