తెలంగాణలో ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్ ల సమ్మె
తెలంగాణలో ఆటోలు మరియు క్యాబ్ ల సమ్మెకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్ లను బంద్ చేయనున్నట్లు తెలంగాణ ఆటో మరియు యాప్ ఆధారిత సంఘాల జేఏసీ (JAC) అధికారికంగా ప్రకటించింది.
ఈ బంద్ కు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు.