సంధ్య థియేటర్ కేసు: అల్లు అర్జున్‌కు వర్చువల్ హాజరుకు కోర్టు అనుమతి
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసును సోమవారం నాంపల్లి కోర్టు విచారించింది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌లో ఉన్నందున, వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ కోరిన పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించింది.
కేసులో కొంతమంది నిందితులు గైర్హాజరు కావడంతో, తదుపరి విచారణను కోర్టు జులై 29కి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులపై దాఖలైన 500 పేజీల ఛార్జ్‌షీట్ కాపీలను ప్రభుత్వ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు.