సింగరేణిలో 300 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ మరియు డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి 300 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2023-24 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల మధ్య కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
విభాగాల వారీగా ఖాళీలు:
-
Google Advertisement
ఇంజినీరింగ్: 150 పోస్టులు
-
నాన్ ఇంజినీరింగ్: 100 పోస్టులు
-
డిప్లొమా: 50 పోస్టులు
నెలవారీ స్టైపెండ్:
-
ఇంజినీరింగ్ & నాన్ ఇంజినీరింగ్: రూ. 12,300
-
డిప్లొమా: రూ. 10,900
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాలి. అనంతరం, దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్ల కాపీలను జతచేసి ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశిత కేంద్రాల్లో నేరుగా సమర్పించాలి.