సీఎంపై అనుచిత వ్యాఖ్యలు: నాగార్జున యాదవ్ జైలుకు
హైదరాబాద్‌కు చెందిన వైకాపా నేత నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఒక టీవీ చర్చలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను, బేగంబజార్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, నాగార్జున యాదవ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.