గాదె సాయికృష్ణ లాకప్ డెత్: సీఐ నాగరాజు విచారణకు హైకోర్టు అనుమతి
సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ సీఐ నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) అనుమతినిచ్చింది.
ఈ మేరకు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సవరించింది. విచారణ పారదర్శకంగా సాగేందుకు, మొత్తం ప్రక్రియను వీడియో తీసి, ఆ రికార్డింగ్‌ను సంబంధిత కోర్టుకు సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.