సామర్లకోట మున్సిపాలిటీకి 'స్పెషల్ గ్రేడ్' హోదా
సామర్లకోట మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ నుండి 'స్పెషల్ గ్రేడ్' మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదా పెంపుతో మున్సిపాలిటీకి నిధుల కేటాయింపులు పెరగడంతో పాటు, పరిపాలనా సౌలభ్యం మెరుగుపడి నగర అభివృద్ధి వేగవంతం కానుంది.