చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం: పరిష్కరిస్తున్నామన్న ఓపెన్‌ఏఐ
ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. ఇమేజ్ జనరేషన్, కస్టమ్ జీపీటీ వంటి పలు ఫీచర్ల వినియోగంలో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిపై స్పందించిన ఓపెన్‌ఏఐ, సమస్యను గుర్తించామని మరియు తమ ఇంజినీరింగ్ బృందం దానిని పరిష్కరించే పనిలో ఉందని తెలిపింది. ఇప్పటికే చాట్‌జీపీటీ సేవలను పునరుద్ధరించామని, ఇతర సర్వీసులను కూడా త్వరలోనే సాధారణ స్థితికి తీసుకొస్తామని కంపెనీ వెల్లడించింది.