ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. ప్రస్తుతం కన్జ్యూమర్ ఎఫైర్స్, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా సేవలందిస్తున్న ఆయనకు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని సలహా మేరకు ఈ అదనపు బాధ్యతలు కేటాయించారు. కర్ణాటకలోని ధార్వాడ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రహ్లాద్ జోషి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.