Article Body
గతేడాది నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌పై అత్యధికంగా 1,33,000, అమెజాన్‌పై 91,248, మరియు మీషోపై 29,284 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటితో పాటు మింత్రా, జెప్టో, బ్లింకిట్, నైకా వంటి సంస్థలపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించిన 47 సంస్థలపై కేంద్ర కన్జూమర్ ప్రొటెక్షన్ अथారిటీ రూ.1.12 కోట్ల జరిమానా విధించింది.
ప్రధాన సమస్యలు:
-
వస్తువులు డెలివరీ కాకపోవడం (79,818 ఫిర్యాదులు)
-
తప్పు లేదా పాడైపోయిన వస్తువులు పంపడం
-
రీప్లేస్‌మెంట్ లేదా రిటర్న్‌కు నిరాకరించడం
-
రిఫండ్లు రాకపోవడం మరియు నకిలీ ఉత్పత్తులు విక్రయించడం
ఫిర్యాదు చేయడం ఎలా? వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
-
టోల్ ఫ్రీ నంబర్: 1915 లేదా 88000 01915
-
వెబ్‌సైట్: consumerhelpline.gov.in
-
యాప్స్: NCH యాప్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

Comments