పాలిమర్ నోట్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రూ.10, రూ.20 విలువలలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా, నకిలీ నోట్ల అరికట్టడానికి మరియు సులభంగా పాడవకుండా ఉండటానికి దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమికంగా ఈ నోట్లను ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వేగవంతం చేస్తోంది.