ఓటరు కార్డుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. "మీ ఓటరు కార్డు వివరాలు సరిపోలలేదు, ఫారం తిరస్కరణకు గురైంది. రూ. 5 చెల్లించి లింక్ ద్వారా అప్‌డేట్ చేయండి" అంటూ వస్తున్న సందేశాలు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశాయి.
ఎన్నికల సంఘం ఎటువంటి డబ్బులు చెల్లించమని గానీ, వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయమని గానీ ఎప్పుడూ కోరదని అధికారులు తేల్చిచెప్పారు.
ముఖ్య సూచనలు:
-
ఇలాంటి నకిలీ లింక్‌లు, సందేశాలు మరియు మోసపూరిత కాల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దు.
-
ఏటీఎం పిన్ నంబర్, పాస్‌వర్డ్, సీవీవీ వంటి గోప్యమైన బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
-
ఎవరికైనా ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లు వస్తే వెంటనే 1950 నంబర్‌కు కాల్ చేసి లేదా సమీపంలోని పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.