క్యాబ్ ప్రయాణికులకు కొత్త నిబంధనలు: మహిళలకు ప్రత్యేక భద్రత
మహారాష్ట్ర ప్రభుత్వం ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్ల కోసం విప్లవాత్మకమైన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మహిళా ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిబంధనలను తీసుకువచ్చారు.
ముఖ్యమైన మార్పులు:
-
మహిళా ప్రత్యేక షేరింగ్: క్యాబ్‌లలో మహిళా ప్రయాణికులు కేవలం ఇతర మహిళలతో మాత్రమే రైడ్ షేర్ చేసుకునే ప్రత్యేక ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
-
కఠినమైన కేవైసీ: రైడ్ పూలింగ్ సేవలను వినియోగించుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలి.
-
నిర్దిష్ట రూట్లు: ప్రయాణ మార్గంలో డ్రైవర్లు ఇష్టానుసారంగా రూట్ మార్చడానికి వీيలేదు. అందరి సమ్మతి ఉంటేనే మార్పులు సాధ్యమవుతాయి.
-
క్యాన్సిలేషన్ జరిమానాలు: డ్రైవర్లు రైడ్ రద్దు చేస్తే రూ.100 నుంచి రూ.500 వరకు, ప్రయాణికులు కారణం లేకుండా రద్దు చేస్తే ఛార్జీలో 5 శాతం లేదా గరిష్టంగా రూ.100 ఫైన్ విధిస్తారు.