మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త: అంత్యక్రియల సాయం పెంపు
రాష్ట్రంలోని అన్ని అర్బన్ లోకల్ బాడీస్ (ULBs)లో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మరణించిన ఉద్యోగి అంత్యక్రియల కోసం అందించే ఆర్థిక సాయాన్ని రూ. 15,000 నుండి రూ. 20,000లకు పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అదనపు వ్యయాన్ని సంబంధిత మున్సిపాలిటీలు తమ జనరల్ ఫండ్స్ నుండి భరించనున్నాయి.