మెటా సేవల్లో అంతరాయం: ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఇబ్బందులు
ప్రపంచవ్యాప్తంగా మెటాకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు మెసెంజర్ సేవల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. ఫీడ్ లోడ్ అవ్వకపోవడం, మెసేజ్‌లు వెళ్లకపోవడం మరియు లాగిన్ సమస్యలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారత్‌తో పాటు కెనడా, బ్రిటన్, తుర్కియే వంటి దేశాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తున్నట్లు ‘డౌన్ డిటెక్టర్’ వెల్లడించింది. ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు మెసేజ్‌లు వస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంతరాయంపై మెటా నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.