భవిష్య పోర్టల్ ద్వారా CGHS హెల్త్ కార్డ్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగ విరమణ తర్వాత ఉచిత వైద్య సేవలు అందించే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) పెన్షనర్ కార్డుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.
ఇందుకోసం పెన్షన్ ప్రాసెసింగ్ పోర్టల్ అయిన 'భవిష్య' (Bhavishya) ను సీజీహెచ్ఎస్ ఆన్‌లైన్ సిస్టమ్‌తో అనుసంధానం చేస్తూ జులై 17, 2026 న అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొత్త విధానం విశేషాలు:
-
సులభమైన దరఖాస్తు: భవిష్య పోర్టల్‌లో ఉన్న ఆమోదిత పెన్షన్ వివరాలు నేరుగా సీజీహెచ్ఎస్ దరఖాస్తుకు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. రెండు చోట్లా వేర్వేరుగా వివరాలు నమోదు చేయాల్సిన పనిలేదు.
-
ఆన్‌లైన్ చెల్లింపులు: హెడ్ ఆఫ్ ఆఫీస్ ఆమోదం తర్వాత, పీపీవో (PPO) జనరేట్ అవుతుంది. అవసరమైన సీజీహెచ్ఎస్ చందాను 'భారత్ కోష్' పేమెంట్ గేట్‌వే ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
-
డిజిటల్ డౌన్‌లోడ్: ప్రక్రియ పూర్తయిన తర్వాత సీజీహెచ్ఎస్ పెన్షనర్ కార్డును నేరుగా సీజీహెచ్ఎస్ లేదా భవిష్య పోర్టల్ నుండి డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గతంలో హెల్త్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు తొలగిపోయాయి. ఈ కొత్త డిజిటల్ విధానంతో ఉద్యోగ విరమణ పొందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా రిటైర్డ్ ఉద్యోగులు వైద్య సేవలను పొందవచ్చు.