భారత నౌకాదళ శక్తి మరింత ఇనుమడించింది. యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ శ్రేణిలో రెండో నౌక అయిన ‘ఐఎన్‌ఎస్ మాలవన్’ (INS Malvan) అధికారికంగా సేవల్లోకి చేరింది. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో సుమారు 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను నిర్మించారు.
ప్రధాన సాంకేతిక ప్రత్యేకతలు:
బరువు & వేగం: ఈ నౌక బరువు 1,100 టన్నులు కాగా, గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
నిఘా వ్యవస్థ: ఇందులో డీఆర్డీవో అభివృద్ధి చేసిన 'అభయ్ హల్-మౌంటెడ్ సోనార్' మరియు ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్‌లను అమర్చారు. దీనివల్ల నీటి అడుగున శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టవచ్చు.
ఆయుధాలు: ఐఆర్‌ఎల్ యాంటీ-సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు, 30 ఎంఎం నావెల్ సర్ఫేస్ గన్‌లు, అడ్వాన్స్‌డ్ ట్రిపుల్ లైట్‌వెయిట్ టార్పెడో లాంచర్లు ఇందులో ఉన్నాయి.
అత్యుత్తమ పనితీరు: మూడు శక్తిమంతమైన మెరైన్ డీజిల్ ఇంజిన్లు, వాటర్-జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీ కారణంగా ఇది క్లిష్టమైన ప్రాంతాల్లోనూ వేగంగా కదలగలదు. బేస్ నుండి ఎలాంటి మద్దతు లేకుండా వరుసగా 14 రోజుల పాటు సముద్రంలో ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యం దీని సొంతం.
తెలుగు న్యూస్ అలర్ట్స్ సంపాదక బృందం రాజకీయాలు, వినోదం, టాలీవుడ్, సెలబ్రిటీ వార్తలు మరియు బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా, వేగంగా పాఠకులకు అందిస్తుంది.
Comments