హెచ్పీ నుండి కొత్త ‘HP Omen 16 Valorant’ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్!
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్పీ (HP), గేమర్ల కోసం ప్రత్యేకంగా ‘HP HyperX Omen 16 Valorant లిమిటెడ్ ఎడిషన్’ ల్యాప్టాప్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రైట్ గేమ్స్తో భాగస్వామ్యంతో వచ్చిన ఈ డివైజ్, గేమింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది.
ముఖ్య ఫీచర్లు:
-
డిస్ప్లే: 16-అంగుళాల IPS డిస్ప్లే, 240Hz రిఫ్రెష్ రేట్.
-
Google Advertisement
ప్రాసెసర్: AMD Ryzen 7 8745HX ప్రాసెసర్, NVIDIA GeForce RTX 4060 గ్రాఫిక్స్.
-
మెమొరీ: 16GB DDR5 RAM (అప్గ్రేడబుల్).
-
ఛార్జింగ్: 83Wh బ్యాటరీ, 280W అడాప్టర్తో కేవలం 30 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది.
-
ప్రత్యేకతలు: OMEN AI ఆప్టిమైజేషన్, హైపర్ఎక్స్ ఆడియో సిస్టమ్, విండోస్ 11 హోమ్.
ధర & లభ్యత: ఈ ల్యాప్టాప్ ధర రూ. 2,24,999. ఇది హెచ్పీ అధికారిక వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు ప్రముఖ రిటైల్ స్టోర్లలో బ్లాక్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది.