హైదరాబాద్‌లో ఒకే టికెట్‌తో మెట్రో, ఆర్టీసీ ప్రయాణం!
హైదరాబాద్ నగర ప్రయాణికులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. మెట్రో రైలు మరియు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో ఒకే టికెట్‌తో ప్రయాణించేలా 'కామన్ మొబిలిటీ టికెటింగ్' విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజూ అధ్యక్షతన జరిగిన హెచ్‌ఎంఆర్‌ఎల్ (HMRL) బోర్డు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధాన ముఖ్యాంశాలు:
-
ఉమ్మడి యాప్ (Common App): మెట్రో మరియు ఆర్టీసీ టికెట్లను ఒకే చోట బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తనునున్నారు.
-
Google Advertisement
ప్రత్యేక పాస్‌లు: ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మెట్రోలో రోజువారీ (Daily), వారపు (Weekly) మరియు నెలవారీ (Monthly) ట్రావెల్ పాస్‌లను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
-
అదనపు కోచ్‌లు & ఫేజ్-2: పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో కోచ్‌ల కొనుగోలుతో పాటు, మెట్రో రెండో దశ (Phase-2) పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ విధానం అమల్లోకి వస్తే నగరవాసులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం మరింత సులభం కానుంది.