Article Body
ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు: ప్రమాణ స్వీకారం
అమరావతి, జూలై 6: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తమ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ వీరి నియామకానికి సంబంధించి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కి పెరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments