Article Body
దేశంలోనే తొలిసారి: ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ
భారతదేశంలోనే తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక విమానాన్ని పూర్తిస్థాయి ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించింది. రూ.792 కోట్ల నకిలీ ఇన్వాయిస్ మోసం కేసులో ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్‌కు చెందిన 'హాకర్ 800A' విమానాన్ని జూలై 1న ఈడీ వేలం వేసింది.
ఈ వేలంలో విమానం రూ.3 కోట్లకు అమ్ముడైంది. పీఎంఎల్‌ఏ (PMLA) చట్టం ప్రకారం, ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును మోసపోయిన పెట్టుబడిదారులకు తిరిగి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆస్తుల వేలం ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, భవిష్యత్తులోనూ ఇటువంటి డిజిటల్ విధానాలను అనుసరిస్తామని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, దర్యాప్తు కొనసాగుతోంది.

Comments