RRB రిక్రూట్‌మెంట్ 2026: 3,993 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా 3,993 జూనియర్ ఇంజినీర్ (JE) మరియు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (CEN No. 04/2026) విడుదల చేసింది.
ముఖ్య వివరాలు:
-
Google Advertisement
మొత్తం పోస్టులు: 3,993 (సికింద్రాబాద్ జోన్: 110)
-
విద్యార్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ.
-
వయోపరిమితి: 18 - 33 ఏళ్లు (నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది).
-
వేతనం: నెలకు ప్రాథమిక వేతనం రూ. 35,400 + అలవెన్సులు.
-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
-
దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 14, 2026
-
చివరి తేదీ: సెప్టెంబర్ 13, 2026
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-I & CBT-II), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
-
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ. 500 (CBTకి హాజరైతే రూ. 400 వాపసు).
-
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు: రూ. 250 (CBTకి హాజరైతే పూర్తి ఫీజు వాపసు).
గమనిక: మరిన్ని వివరాల కోసం అధికారిక RRB నోటిఫికేషన్‌ను చూడండి. rrbapply.gov.in