తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు గుడ్ లీఫ్ అందించింది. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (BC) మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన ఈ పథకం ప్రధాన ముఖ్యాంశాలు:
-
Google Advertisement
స్వయం ఉపాధి: మహిళలు ఇళ్ల వద్దే ఉంటూ ఆర్థికంగా స్థిరపడేలా ఈ పథకాన్ని రూపొందించారు.
-
ఆటోమేటిక్ మిషన్లు: శ్రమను తగ్గించి, వేగంగా పనిచేసేందుకు అధునాతన ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందజేస్తారు.
-
నియోజకవర్గానికి 1000: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 1,000 చొప్పున కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారు.
అర్హతలు, వయోపరిమితి, ఆదాయ పరిమితి, దరఖాస్తు చేసుకునే విధానం (మీ-సేవ/ఆన్‌లైన్) మరియు తేదీలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో అధికారికంగా వెల్లడించనుంది.