అంతర్జాతీయ విమాన సేవలకు సిద్ధమైన భోగాపురం ఎయిర్‌పోర్టు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపునిచ్చింది. 'ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025' ప్రకారం, ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా 'ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్'గా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ హోదాతో, కేటగిరీ-1 విమానాశ్రయాల జాబితాలో భోగాపురం 39వ స్థానంలో నిలిచింది. దీనివల్ల భోగాపురం నుండి అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభించడానికి అవసరమైన అన్ని చట్టపరమైన మార్గాలు సుగమమయ్యాయి. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితేశ్‌కుమార్ వ్యాస్ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు.