నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్
NBK111 సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది. రాజమండ్రిలో షూటింగ్ చేస్తుండగా ఎడమ మోకాలికి గాయమవడంతో, ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షల్లో ఎడమ మోకాలి కండరంలో రక్తం గడ్డకట్టినట్లు (మజిల్ టియర్) వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఆయనకు నిరంతరం చికిత్సనందిస్తోంది. పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.