AP EAPCET Results 2026: విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 30న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు, మార్కులు కలిసే అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ (AP EAPCET-2026) రాసిన విద్యార్థులకు అలర్ట్. ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ (ఎల్లుండి) ఉదయం 11 గంటల తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. పరీక్షలను నిర్వహించిన జేఎన్‌టీయూ కాకినాడ (JNTUK) అధికారులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
భారీగా హాజరైన విద్యార్థులు ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 3.29 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. అందులో ఎంపీసీ (MPC) స్ట్రీమ్ నుండి 2.58 లక్షల మంది, బైపీసీ (BiPC) స్ట్రీమ్ నుండి 70,929 మంది విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థులకు యాడ్ స్కోర్ (కలిసొచ్చే మార్కులు)! గత నెల మే 25వ తేదీన విడుదల చేసిన ప్రిలిమినరీ 'కీ'పై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ సుదీర్ఘంగా పరిశీలించింది. ప్రాథమిక కీ లో దొర్లిన కొన్ని తప్పుల కారణంగా నష్టపోయిన అభ్యర్థులను ఆదుకునేలా, రెండు స్ట్రీమ్‌ల (MPC, BiPC) విద్యార్థులకు కొన్ని మార్కులు (యాడ్ స్కోర్) కలపాలని బోర్డు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
గమనిక: తుది ఫలితాలతో పాటే ఫైనల్ కీ, ర్యాంకులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ర్యాంక్ కార్డ్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ర్యాంకుల ఆధారంగానే తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఫలితాలు విడుదలైన తర్వాతే కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు.