అనకాపల్లిలో రూ. 1,600 కోట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం
అనకాపల్లిలోని పరవాడ పారిశ్రామిక వాడలో సోలార్ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అక్షత్ గ్రీన్‌టెక్ (మైత్రా ఎనర్జీ గ్రూప్) సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రూ. 1,600 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంట్ సామర్థ్యం 3.5 GW. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 750 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది.