తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం: ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 6న ఆడుకుంటూ కనిపించకుండా పోయిన పాప ఆచూకీ కోసం గత 25 రోజులుగా 12 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా, ఎటువంటి ఆధారాలు లభించలేదు.
కేసు దర్యాప్తును వేగవంతం చేస్తూ, పాప గురించి సమాచారం అందించిన వారికి రూ. లక్ష నగదు బహుమతి ఇస్తామని తుని పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
సంప్రదించాల్సిన నంబర్లు: 9440796508, 9440796531, 9440796573.
పాప అదృశ్యమైన సమయంలో ఆమెతో పాటు ఉన్న పెంపుడు కుక్క తిరిగి రావడం, ఆ తర్వాత అది మృతి చెందడం వంటి పరిణామాలు పోలీసులకు సవాలుగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తూ, ప్రజల నుంచి వచ్చే సమాచారం కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.